Stampede Recovered Devotees Protocal darshan Tirumala: టీటీడీ మాట నిలబెట్టుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయిస్తామని టీటీడీ ఛైర్మన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాయాల నుంచి కోలుకున్న 28 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకంగా చేయించారు. గాయాల నుంచి కోలుకున్న 28 మంది శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ప్రోటోకాల్ దర్శనం చేయించారు. దీనిపై భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనలో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది.