Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు పంపింది. సినిమా విడుదలైన నాటి నుంచి పది రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తుంది.