ప్రేమ కోసం తపించే కుర్రాడిగా ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఇరగదీశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ని మలుపుతిప్పింది. ఇక ఈ సినిమాలోని పాటలకైతే ఆ క్రేజే వేరు. ప్రేమించిన అమ్మాయి కోసం అల్లు అర్జున్ పడే తపనను పాటల రూపంలో చూపించి ప్రేక్షకులను హత్తుకున్నారు. ఆ పాటల్లో ఒకటి ఫీల్ మై మై లవ్ సాంగ్. నా ప్రేమను ఫీల్ అయితే చాలంటూ హీరో పాడే ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పటి కుర్రాళ్లకు కూడా ఈ సాంగ్ అంటే మహా పిచ్చి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.