Velagapudi Fire Accident: అమరావతిలో అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు..

5 months ago 26
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Entire Article