కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఏళ్ళు గడిచినా ఈ పాటల డిమాండ్ అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించే బ్యూటీఫుల్ సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాంటి పాటనే ప్రేమించే ప్రేమవా సాంగ్. సూర్య, భూమికలతో షూట్ చేసిన ఈ సాంగ్ రెహమాన్ బాణీలతో యూత్‌కి అలా కనెక్ట్ అయిపోయింది. నువ్వు నేను ప్రేమ సినిమాలోని ఈ పాట వచ్చి 20 ఏళ్ళు దాటినా ఇప్పటికీ యువత మనసు దోచేస్తోంది.