నవీన్ పొలిశెట్టి- మీనాక్షీ చౌదరి లీడ్ రోల్స్ లో దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘భీమవరం బల్మా’ పాట (Bhimavaram Balma Song) రిలీజ్ ఈవెంట్ భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ వేదికపై నవీన్- మీనాక్షి డ్యాన్స్ చేసి సందడి చేశారు.