టాలీవుడ్ స్టార్ జంట విజయ్–రష్మిక సొంతూరు తమ్మన్‌పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా వారిని ఒక్కసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, విజయ్–రష్మిక జంటకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.