అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'విరోష్' (VIROSH) పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో కనులపండువగా జరిగింది. గురువారం ఉదయం 10:10 గంటలకు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న సంప్రదాయబద్ధంగా ఆంధ్ర పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సాయంత్రం రష్మిక పుట్టింటి ఆచారాల ప్రకారం కొడవ (Kodava) పద్ధతిలో మరోసారి వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకుంటూ విజయ్-రష్మిక టీమ్ కోట వెలుపల ఉన్న మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్లకు స్వీట్ బాక్సులను పంపిణీ చేసింది. ఈ బాక్సులపై రష్మిక ఫోటో ఉండటం విశేషం. అతికొద్ది మంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.