ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో కాస్తో కూస్తో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజవుతున్న సినిమా 'విష్ణు విన్యాసం'. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. రధన్ స్వర పరిచిన ఈ పాటను శరత్ సంతోష్ ఆలపించాడు.