Raghuveera Reddy Comments On Ys Jagan: జగన్ సహా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. అసెంబ్లీలో ఎల్‌నినో అంశంపై చర్చిస్తే బావుంటుందన్నారు. కేంద్రం సహకారంతో రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఇటు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు వెంటనే కృష్ణా జలాలపై చర్చించాలని కూడా సూచించారు రఘువీరారెడ్డి.