Nellore Ysrcp Mayor Candidate Anam Vijaykumar Reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని వైఎస్ జగన్ ప్రకటించారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే జగన్ ఆనంను అభ్యర్థిగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆనం విజయ్‌కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన భార్య నెల్లూరు జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు.