YSRCP: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి అరెస్ట్.!

9 months ago 29
క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణాతో పాటుగా నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాలు వినియోగించారనే ఆరోపణలపై కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిబ్రవరిలో కేసు నమోదు కాగా.. ఈ కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు సోమవారం ఉదయానికి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article