టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాక్యలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని.. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు బతికిరారు కదా? ఎవరో ఏదో మాట్లాడారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. కాకుంటే తప్పిదం జరిగింది.. ఎలా జరిగిందో విచారణ చేస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించే చేశారంటూ జనసేన నేతలు వెంటనే స్పందించారు. దీంతో ఛైర్మన్ మళ్లీ స్పందించారు. సోషల్ మీడియాలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని.. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సఎం, మంత్రుల కంటే ముందుగా తానే క్షమాపణలు చెప్పానని.. తన వ్యాఖ్యలు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించినవి కాదని.. ఇలా ఆపాదించడం భావ్యం కాదన్నారు.