గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులు వారు కోరుకున్న విధంగా పింఛన్ అందించాలని నిర్ణయించింది. గురుకులాల్లో కావాలనుకుంటే అక్కడే అందించాలని.. లేదా ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ఇంటి వద్ద పింఛన్ డబ్బులు అందించాలని కోరుకుంటే ఆ రకంగా పింఛన్ అందించాలని నిర్ణయించింది. అలాగే బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని కోరితే.. పింఛన్ నగదు మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ ప్రక్రియ చేపట్టేందుకు సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.