Anantapur Devotee Plea On Rs 20 Note To Mother In Law Death: దేవుడ్ని ఓ భక్తురాలు వింత కోరిక కోరుకున్నారు. అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు అంటూ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం.. పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా... ఓ 20 నోటు రూపాయల నోటుపై రాసి ఉంది.