ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమ్మాయిలను వేధిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మగతనమంటే ఆడపిల్లలను వేధించడం కాదని.. దమ్ము చూపించాలంటే జిమ్నాస్టిక్స్‌కు వెళ్లాలని అన్నారు. ఆడపిల్లల్ని వేధించడమే మగతనమనుకుంటే తొక్కి నారతీస్తానని హెచ్చరించారు. అలాగే పిఠాపురంలో మరోసారి ఈవ్ టీజింగ్ పేరు వినపించకూడదని పోలీసులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.