అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. మామిడితోటలో పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ తమ్ముడు కాలు జారి నీటి కుంటలో పడగా.. అతణ్ని కాపాడే ప్రయత్నంలో అన్న కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రమాదవశాత్తూ ఇద్దరు కొడుకులూ ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకోవటంతో వారి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.