Janasena Party Leader Rayapati Aruna Husband Filed Nomination: జనసేన పార్టీ మహిళా నేత రాయపాటి అరుణ కల ఆరేళ్ల తర్వాత నిజమైంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. ఎన్నికల నిబంధన కారణంగా పోటీకి దూరమయ్యారు. ఈసారి ఒంగోలు కార్పొరేషన్‌లో తన భర్త పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. ఎట్టకేలకు ఆమె భర్త కొర్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. అరుణ భర్త ఒంగోలు కొర్పొరేషన్ 1వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.