ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లను విరాళాలు కొనసాగుతున్నాయి. పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు తమ వంతు సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన మాదాల శ్రీరామ్ భాస్కర్ అనే వ్యక్తి అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందించారు. మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసిన మాదాల శ్రీరామ్ భాస్కర్.. విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మాదాల శ్రీరామ్ భాస్కర్‌ను నారా లోకేష్ అభినందించారు.