Amaravati Farmers Koulu: అమరావతి రైతులకు శుభవార్త. ప్రభుత్వం వార్షిక కౌలు డబ్బులు జమ చేస్తోంది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు డబ్బులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం నుంచి అమరావతి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. దీనిపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని రైతుల పింఛన్లు, వార్షిక కౌలు చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇటీవలే రూ.255 కోట్లు విడుదల చేసింది.