ఏపీ రాజధాని అమరావతిలో ఉద్రిక్తత ఏర్పడింది. పెనుమాక పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలను అమరావతి రైతులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతల కారుపై కొంతమంది రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. మరోవైపు అమరావతి పర్యటనకు వెళ్తే తమను చంపేందుకు యత్నించారని.. దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.