Amaravati Major Fire Breaks Out: ఏపీ రాజధానిలో మళ్లీ భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలో హెచ్‌వోడీల భవనాల నిర్మాణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి పైపులకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. వెంటనేసమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. ఈ నెల 11న కూడా ఇదే తరహాలో మరో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.