అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సిన వదినమ్మే.. భర్తకు తెలియకుండా, భార్య వదిలేసిన తన సొంత మరిదిని టార్గెట్ చేసింది. పక్కాగా ప్లాన్ చేసి.. ఓ ముగ్గురితో డీల్ మాట్లాడుకుని మరీ.. అడ్డు తొలగించుకోవాలనుకుంది. అంతా అనుకున్నట్టుగానే జరిగింది కానీ.. అసలు విషయం మర్చిపోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైంది. ఈ దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో దారుణమై ఘటన చోటుచేసుకుంది.