అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. బెయిల్ వచ్చేసింది

2 weeks ago 3
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో స్టార్ హీరో అల్లు అర్జున్‌‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియగా.. నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 50 వేల రూపాయలు, రెండు పూచీకత్తులను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో జైలుకెళ్లిన మరుసటి రోజు అల్లు అర్జున్‌ విడుదలయ్యారు. ఇప్పుడు బెయిల్ కూడా వచ్చేసింది. కాబట్టి అల్లు అర్జున్ మళ్లీ జైలుకెళ్లే అవసరమూ లేదు. కాకపోతే, ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతాయి.
Read Entire Article