ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. గరికపాటి గురించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. సత్యదూరమైనవి, నిరాధారమైనవీ కొంతమంది, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. ఆయన గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి ప్రచారాలను ఇకనైనా ఆపకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని.. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.