జగిత్యాల బీజేపీ నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన తండ్రి ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారును బహుమతిగా ఇవ్వడం రాజకీయ దుమారం రేపింది. పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న నాయకులను పక్కనపెట్టి శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ వర్గం ఆరోపించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించిన అర్వింద్ కారు బహుమతి రాజకీయ అంశం కాదని.. సోదరి భావంతో ఆశీర్వాదంగా ఇచ్చానని స్పష్టం చేశారు. శ్రావణికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.