కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక గ్రామం పేరు 'ల**గూడ'గా ఉండటంపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరకరమైన పేరు వల్ల గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. అధికారిక రికార్డుల్లో పేరు మార్చి 'నందిగూడ'గా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.