ఆ ఎన్నికల షెడ్యూల్ అబద్ధం.. షేర్ చేస్తే చర్యలు తప్పవు.. ఏపీ ఎన్నికల కమిషనర్ వార్నింగ్

1 hour ago 1
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూ్ల్ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలపై ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా దుష్ప్రచారమని స్పష్టం చేశారు. ఇలాంటివి నమ్మవద్దని.. ఫార్వార్డ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ సమాచారం అయినా పత్రికాప్రకటన లేదా విలేకర్ల సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తే సైబర్ చట్టం కింద కేసులు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Entire Article