Vizianagaram Super Smelters Steel Plant Rs 8570 Crores: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు విజయనగరం జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ రానుంది. 1,085 ఎకరాల్లో 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.8,570 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనివల్ల స్థానికులకు 750 ఉద్యోగాలు వస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.