ఎన్నికలు అంటేనే ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వివిధ రకాల ప్రణాళికలు వేస్తుంటారు. అందులో ముఖ్యంగా తాము గెలిస్తే ఏం చేస్తామో ముందే చెప్పేస్తారు. వివిధ రకాల హామీలు ఇస్తూ ఓటర్లకు గాలం వేస్తుంటారు. ఈ సారి తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. కొంతమంది అయితే.. ఎమ్మెల్యేగా నిలిచే అభ్యర్థి ఎన్ని హామీలు ఇస్తారో అలాంటి హామీలు ఇవ్వడం గమనార్హం. అయితే ఓ గ్రామ సర్పంచ్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాడు. అదే విధంగా అమలు కూడా చేశాడు.