రాష్ట్రంలో శిథిలమైన వంతెనల పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,430 కోట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,032 కోట్లతో రోడ్లను బాగు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 352 బ్రిడ్జిల పునర్నిర్మాణానికి నిధులు కోరినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..