తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా తమ కుటుంబసభ్యులందరి వివరాలను ఈ-కేవైసీ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే బియ్యం, ఇతర నిత్యావసరాలు లభిస్తాయి. గతంలో పలుమార్లు గడువు పెంచినా చాలామంది ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ప్రస్తుతం కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ నెల కోటా బియ్యం ఇచ్చినా.. ఇకపై ఈ-కేవైసీ చేయించుకోని వారికి వచ్చే నెల నుంచి సరుకులు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.