Ambati Rambabu Praises TTD Annaprasadam: మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల అన్నప్రసాదాల రుచి, పరిశుభ్రత, నాణ్యతను ప్రశంసించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతిరోజూ లక్షలాది మందికి అన్నదానం అందించే ఈ బృహత్తర కార్యక్రమం భక్తుల విరాళాలతోనే కొనసాగుతోందని, దీని వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం ఉందని తెలిపారు. భక్తులందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.