పోలీసులు వార్నింగ్ ఇచ్చినా హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌ల ఆగడాలు తగ్గడం లేదు. కొత్త BMW కారును కొన్న ఓ యజమానిని అడ్డగించిన కొందరు ట్రాన్స్‌జెండర్లు.. రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోరూమ్ నుంచి కొత్త కారు డెలివరీ తీసుకుని వెళ్తున్న వ్యక్తిని అడ్డుకుని.. డబ్బుల కోసం డిమాండ్ చేశారు. నగదు లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.