టాలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". 'ప్రేమమ' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. భిన్నమైన కథాంశాలు ఎంచుకోవడంలో పేరున్న ఆది పినిశెట్టి, మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు.