వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఛైర్మన్ ఎన్నికపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఛైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నంలో గెలిచిన ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.