సినీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తెలియని ఎవరు ఉండరు. అలాంటిది నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఈదులూరు గ్రామ శివారులో కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ ఈదులూరు గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై ప్రత్యేక కథనం అందించడం కోసం ‘లోకల్ 18’ బృందం ఈదులూరు గ్రామాన్ని సందర్శించగా .. రాజమౌళి అత్త రాధమ్మ పలు కీలక విషయాలు వెల్లడించారు.