ఈ రైతు పంట పండింది.. క్వింటాల్ మిరప రూ.87,786.. సన్మానం చేసిన అధికారులు

6 months ago 29
అనంతపురం జిల్లాలో ఓ మిరప రైతు పంట పండింది. వడ్రవన్నూరుకు చెందిన తిప్పేస్వామి అనే మిరప రైతు డబ్బీ డ్రై మిరపను పండించారు. ఈ మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్ తరలించగా.. మార్కెట్లో గురువారం రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.87,786 పలికింది. దీంతో రైతును మార్కెట్ అధికారులు, వ్యాపారులు, తోటి రైతులు సన్మానించారు. పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించారు.
Read Entire Article