హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ చిన్నారి రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని.. అదృష్టం అన్నిసార్లు కలిసి రాదని సజ్జనార్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.