ఉత్తరాంధ్రపై 'అర్నబ్' పంజా.. భారీ వర్షాలు .. విరిగిపడుతున్న చెట్లు

1 hour ago 2
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అర్నబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కూలిపోయిన చెట్లను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు ఏరియాల్లో ఏకధాటిగా వర్షం పడుతుంది. దీంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.
Read Entire Article