Rammohan Naidu On Visakhapatnam Railway Zone Bhoomi Pooja: ఉత్తరాంధ్రవాసులకు కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త రైల్వే జోన్‌కు త్వరలోనే భూమి పూజ చేయనున్నామని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు కొత్తగా వేసిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. దసరా, దీపావళి మధ్య శుభఘడియల్లో జోన్‌కు భూమి పూజను అంతే సంబరంగా నిర్వహిస్తామని ప్రకటించారు.