హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెములలో కబ్జాకు గురైన 1034 గజాల పార్కు స్థలాన్ని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారులు నిర్మించిన ప్రహరీ గోడను సోమవారం కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్లాట్లు కొనేటప్పుడు పక్కన ఉన్న పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.