మనుషుల కంటే మృగాలే నయం. వాటి కడుపు నింపునేందుకే వేటాడి ఇంకో జీవాన్ని చంపేస్తుంది. ఒక్కసారి ఆకలి తీరిందంటే.. ఒకవేళ వాటి మీద దాడికి వస్తే తప్ప, ఇంకో జీవి జోలికి వెళ్లవు. కానీ.. మనుషులు మాత్రం ఆకలితో కాదు.. కసితో, సైకోయిజంతో మూగజీవాలను అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 31 కుక్కలపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. ఈ దాడిలో 20 కుక్కలు ప్రాణాలు వదలగా.. 11 శునకాలుకు తీవ్ర గాయాలయ్యాయి.