Apsrtc Bus Charges In Festival Season: ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పండగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఉంటే ప్రయాణికులపై అదనపు బాదుడు ఉండేదని.. ఈసారి అటువంటి అదనపు ఛార్జీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు బాదుడు లేకుండా ఈసారి సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని చేసిన విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.