PV Sindhu Deputy Collector On Duty Extended: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్నిమరో ఏడాది పొడిగించింది. సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరుసగా ఆరోసారి ఆన్‌డ్యూటీ సౌకర్యం పొడిగించినట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఓడీ సౌకర్యం పొడిగించారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా ఉన్నారు.