Andhra Pradesh Assembly Apco Handloom Products Stalls: ఏపీ అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వం ఆప్కో ఆధ్వర్యంలో చేనేతల స్టాల్స్ ఏర్పాటు చేయించింది. అక్కడ స్టాల్స్‌లో చరీలు, పొందూరు చొక్కాలు, పంచెలు కండువాలతో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతాయి. ఏకంగా 40శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్త్రాలను కొనుగోలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.