ఏపీ ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికత వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు డ్రోన్ల సర్వీసులు అందుబాటులోకి తెస్తోంది. రైతులు తమ పంట పొలాల కోసం డ్రోన్ల సర్వీసులను క్యాబ్‌ల తరహాలోనే బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని అల్లూరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రైతులు తమ ఫోన్ ఉపయోగించి క్యాబులు బుక్ చేసుకున్న మాదిరిగానే డ్రోన్ల సర్వీసులను కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు ఖర్చు తగ్గటంతో పాటుగా అనారోగ్య సమస్యలు తప్పుతాయంటున్నారు.