AP Weather Today: ఏపీలో గతవారం వరకు వర్షాలు కురిశాయి.. వరుణుడు బ్రేక్ తీసుకోవడంతో సూర్యుడు రంగంలోకి దిగాడు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 4 నుంచి మళ్లీ వానలు పడతాయంటున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.