National HighWay 365BB Buttayagudem Kovvur Two Lanes Upgradation: ఏపీలో మరో నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 365బీబీలో.. బుట్టాయగూడెం-ఎల్‌ఎన్‌డీ పేట, పట్టిసీమ- కొవ్వూరు సెక్షన్ల మధ్య 45.09 కిలోమీటర్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.840.41 కోట్లకు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మొత్తం 45 కిలోమీటర్ల 2 లేన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.