Andhra Pradesh HPV Vaccination Free Of Cost For Girls: ఆంధ్రప్రదేశ్‌లో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తారు. మొత్తం సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.